: వరంగల్ రైల్వేస్టేషన్ లో కుప్పకూలిన ఓవర్ హెడ్ ట్యాంక్...తప్పిన ప్రమాదం
వరంగల్ రైల్వేస్టేషన్ లోని ఓవర్ హెడ్ ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఓవర్ హెడ్ ట్యాంక్ పగిలిపోవడంతో స్టేషన్ మొత్తం నీటితో నిండిపోవడంతో రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. రైల్వే లైన్ పై హై వోల్టేజ్ విద్యుత్ సరఫరా అవుతుండటంతో, ఎక్కడ షార్ట్ సర్క్యూట్ జరుగుతుందోనని సిబ్బంది భయపడ్డారు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాగా, ఓవర్ హెడ్ ట్యాంక్ ను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించకపోవడం వల్లే ఉన్నపళంగా కుప్పకూలిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.