: మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కాళ్లూచేతులు నరికేయడమే సరైన పద్ధతి: రాజ్ థాకరే


దేశంలో మహిళలు, పిల్లలపై దారుణాలకు పాల్పడుతోన్న ఘటనలు అధికమయిపోతోన్న నేపథ్యంలో మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) ఛీఫ్ రాజ్ థాకరే దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇటువంటి దారుణాల‌కు ఒడిగ‌ట్టేవారిపై 'షరియా' (ఇస్లామిక్) వంటి చట్టాలను అమ‌లు చేయాల‌ని ఆయ‌న అన్నారు. ప‌దిరోజుల క్రితం మ‌హారాష్ట్ర‌లో 15 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన సంఘటనతో రాష్ట్రంలోని భద్రతా వ్యవ‌స్థ స‌మ‌ర్థ‌త ఏంటో తెలుస్తోంద‌ని ఆయ‌న అన్నారు. కంర్ణత్ తాలూకా కోపర్ది గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపిన ఆయ‌న ప్ర‌భుత్వ తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ అధికారంలో ఉన్న మ‌హారాష్ట్ర‌లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం, హత్య జ‌ర‌గ‌డం ఆందోళన క‌లిగించే అంశ‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇటువంటి దుర్మార్గాల‌కు పాల్ప‌డే వారి కాళ్లూచేతులూ నరికేయడమే సరైన పద్ధత‌ని ఆయ‌న అన్నారు. అలాంటి శిక్షలు లేకపోవడం వల్లే ఇటువంటి అఘాయిత్యాలు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వం కంటే బీజేపీ స‌ర్కారు పాల‌న‌లోనే రాష్ట్రంలో ఇటువంటి ప‌రిస్థితులు ఎక్కువ‌య్యాయ‌ని ఆయ‌న తెలిపారు. అట్రాసిటీ నిరోధక చట్టం దుర్వినియోగం కాకూడ‌ద‌ని, అవ‌స‌ర‌మైతే దానికి మార్పులు చేయాల‌ని రాజ్ థాకరే డిమాండ్ చేశారు. చ‌ట్టంలోని సాధారణ విధానాలతో బాధితులకు న్యాయం జరిగే క్ర‌మంలో చాలా స‌మ‌యం ప‌డుతోంద‌ని, నేరాలకు పాల్పడేవారి ప‌ట్ల క‌ఠినంగా ఆ విధానాలు లేవ‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News