: వాజ్ పేయి పిలిచారు... మోదీ ముంచారు: సిద్ధూ సంచలన వ్యాఖ్య
మాజీ ప్రధాని వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో తనను బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారని, ఆయన కోరిక మేరకు తాను బీజేపీలోకి వస్తే, నరేంద్ర మోదీ తనను నిలువునా ముంచారని ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యాఖ్యానించారు. నేడు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, తన దృష్టిలో పంజాబ్ కన్నా పార్టీ పదవులు, హోదాలు ముఖ్యం కాదని అన్నారు. 2004లో మరో 14 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయన్న వేళ తాను బీజేపీలో చేరానని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఉత్తర భారతావనిలో తానొక్కడినే బీజేపీ నుంచి విజయం సాధించానని చెప్పారు. కాగా, సిద్ధూ మీడియా సమావేశం అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. "సిద్ధూ పంజాబ్ వెళితే, అక్కడ కొనసాగుతున్న మాదక ద్రవ్యాల సామ్రాజ్యంపై స్పందిస్తారు. సిద్ధూ బారిన పడకుండా వారిని బీజేపీ రక్షించాలని చూస్తోంది. ఇదో షాకింగ్" అని వ్యాఖ్యానించారు.