: తెలంగాణలో 6 వర్సిటీలకు కొత్త వీసీలు!... ఉస్మానియాకు రామచంద్రం, జేఎన్టీయూకు వేణుగోపాల్ రెడ్డి!


తెలంగాణలోని ఆరు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సెలర్లను నియమిస్తూ కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం సదరు నియామకాలకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నియామకాల్లో హైదరాబాదులోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)కు ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి వీసీగా నియమితులయ్యారు. ఇక ఉస్మానియా వీసీగా రామచంద్రం, వరంగల్ లోని కాకతీయ వర్సిటీ వీసీగా సాయన్న నియమితులయ్యారు. తెలుగు యూనివర్సిటీ వీసీగా ఎస్వీ సత్యనారాయణ, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా సాంబయ్య నియమితులయ్యారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా సీతారామారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News