: విశాఖ చేరిన వైఎస్ జగన్!... విమానం గల్లంతు బాధితులకు పరామర్శ!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం చేరుకున్నారు. ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతు ఘటనకు సంబంధించిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకే ఆయన నేటి ఉదయం హైదరాబాదు నుంచి విశాఖ వెళ్లారు. నాలుగు రోజుల క్రితం చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన విమానంలో ఉన్న 29 మంది ఎయిర్ ఫోర్స్ సిబ్బందిలో 8 మంది విశాఖ వాసులున్నారు. నాలుగు రోజులవుతున్నా తమవారి జాడ కానరాని నేపథ్యంలో వారి కుటుంబాలు తీవ్ర వేదనలో కూరుకుపోయాయి. కొద్దిసేపటి క్రితం విశాఖ చేరుకున్న వైఎస్ జగన్... బాధిత కుటుంబాలను పరామర్శించారు.