: నెం.1 అబద్ధాల కోరుగా హరీశ్‌రావు మారారు: త‌మ్మినేని


తెలంగాణ ప్ర‌భుత్వం మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ భూనిర్వాసితుల‌పై చేయించిన లాఠీచార్జీ ప‌ట్ల వామ‌ప‌క్షాలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ అంశంపై హైద‌రాబాద్‌లో ఈరోజు అఖిల‌ప‌క్షం స‌మావేశం నిర్వ‌హించింది. సీపీఎం, సీపీఐ కార్య‌ద‌ర్శులు త‌మ్మినేని వీర‌భ‌ద్రం, చాడ వెంట‌ర‌రెడ్డి, కాంగ్రెస్ నేత కోదండ‌రెడ్డి, జ‌స్టిస్ చంద్ర‌కుమార్ తో పాటు ప‌లువురు నేత‌లు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా త‌మ్మినేని మాట్లాడుతూ.. నెంబర్ వన్ అబద్ధాల కోరుగా హరీశ్‌రావు మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆయన మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్ర‌భుత్వం అహంకారపూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోందని, రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మారుస్తోంద‌ని తమ్మినేని మండిప‌డ్డారు. 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కార‌మే నిర్వాసితుల‌కు ప‌రిహారం చెల్లించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. తమ్మినేని ఈరోజు మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. పోలీసుల దాడిలో గాయపడిన బాధితులను ఆయన పరామర్శిస్తారు.

  • Loading...

More Telugu News