: ఇక ఏపీకి ‘ప్యాకేజీ’ వంతు!... లోక్ సభలో యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు నోటీసు!
ఓ వైపు ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రైవేటు మెంబర్ బిల్లు రాజ్యసభను కుదిపేస్తోంది. మరోవైపు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలనే డిమాండ్ తో టీడీపీ యువ నేత, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్ సభను కుదిపేయనున్నారు. ఈ మేరకు నేటి ఉదయం ఆయన ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ లోక్ సభలో నోటీసు ఇచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఏపీని ఆదుకునే బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన సదరు నోటీసులో పేర్కొన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలని, విభజన చట్టంలోని హామీలన్నింటినీ పక్కాగా అమలు చేయాలని ఆయన ఆ నోటీసులో డిమాండ్ చేశారు.