: మాల్యాకు మరో దెబ్బ!... ఆస్తులు వెల్లడించలేదన్న అంశంపై సుప్రీంకోర్టు నోటీసు!


బ్యాంకులకు రూ.9 వేల కోట్ల రుణాలను ఎగవేసి ఎంచక్కా లండన్ చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు కోర్టు నోటీసులు వరుసగా జారీ అవుతున్నాయి. తన ఆస్తులకు సంబంధించి మాల్యా తప్పుడు సమాచారమిచ్చారని ఆరోపిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా ఆయనకు మరో నోటీసు జారీ చేసింది. బ్యాంకుల పిటిషన్ పై నేటి ఉదయం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసు తీవ్రత దృష్ట్యా బ్యాంకుల పిటిషన్ పై అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం మాల్యాకు నోటీసు జారీ చేసింది.

  • Loading...

More Telugu News