: సిద్ధిపేట‌లో పోటాపోటీగా వామ‌ప‌క్షాలు, టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల ర్యాలీ.. ఉద్రిక్తత


మ‌ల్ల‌న్నసాగ‌ర్ నిర్వాసితుల‌పై పోలీసుల లాఠీచార్జీకి నిర‌స‌న‌గా మెద‌క్ జిల్లాలో వామ‌పక్షాలు బంద్ నిర్వ‌హిస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే, జిల్లాలోని సిద్ధిపేట‌లో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. వామపక్షాలు, టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ఈరోజు పోటాపోటీగా ర్యాలీలు నిర్వ‌హిస్తున్నారు. బంద్ పాటించాలంటూ నినాదాలు చేస్తూ వామ‌ప‌క్షాలు ర్యాలీ నిర్వ‌హిస్తోంటే, దానికి వ్య‌తిరేకంగా టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు కూడా ర్యాలీ నిర్వ‌హిస్తున్నారు. దీంతో అక్క‌డ ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్టారు.

  • Loading...

More Telugu News