: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మెదక్ జిల్లా సంగారెడ్డి ఆర్టీసీ డిపో ముందు ఈరోజు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు కారణంగా భూములు కోల్పోయినవారిపై పోలీసుల లాఠీఛార్జిని ఖండిస్తూ ఈరోజు మెదక్ జిల్లాలో బంద్ నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి ఆర్టీసీ డిపో ముందు కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. డిపోముందు బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు పలువురు సీపీఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.