: యూపీలో ఘోర ప్రమాదం!... స్కూల్ బస్సును ఢీకొన్న రైలు, ఏడుగురు చిన్నారుల దుర్మరణం!
ఉత్తరప్రదేశ్ లో కొద్దిసేపటి క్రితం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చక్కగా తయారై స్కూలుకెళ్లేందుకు చిన్నారులు ఎక్కిన ఓ స్కూల్ బస్సును వేగంగా దూసుకువచ్చిన రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ లోని భడోహీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాపలా లేని రైల్వే గేటు కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. వేగంగా దూసుకువస్తున్న రైలును అంతగా గుర్తించని స్కూల్ బస్సు డ్రైవర్ రైల్వే పట్టాలను దాటేందుకు యత్నించాడు. అయితే పట్టాలు దాటేలోగానే వేగంగా దూసుకువచ్చిన రైలు స్కూల్ బస్సును ఢీకొట్టేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.