: నాకు ఇష్టమొచ్చినట్లుగా నేను ఉంటాను: ఆనం వివేకా


‘నాకు ఇష్టమొచ్చినట్లుగా నేను ఉంటాను. డ్రెస్సులు వేసుకుంటాను. ఒకరు చెప్పినట్లుగా నేను చేయను’ అని ఆనం వివేకానందరెడ్డి అన్నారు. కొత్త గెటప్ ల్లో తాను కనిపించడం వెనుక ఎటువంటి కారణం లేదని, అది తన స్పెషాలిటీ అని, తనకు ఎలా ఉండాలంటే అలా చేస్తానని చెప్పారు. ‘నా బొడ్లో తాళాలు పెట్టుకుంటా, ‘కిర్రు’ చెప్పులు వేస్తాను. నాకు జుట్టు ఉంది కాబట్టి నా ఇష్టమైన రంగు వేస్తాను. ఈ ఆలోచనలన్నీ నావే. నేను ఒకరు చెబితే చెడిపోలేదు.. మరొకరు చెబితే బాగుపడలేదు’ అని వివేకా చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News