: అగ్రిగోల్డ్ కేసు పురోగతి సరిగ్గా లేదంటూ చంద్రబాబు అసహనం
అగ్రిగోల్డ్ కేసు పురోగతిపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సమీక్షలో డీజీపీ సాంబశివరావు, సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కేసు పురోగతి సరిగ్గాలేదని సీఐడీ చీఫ్ పై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని, బాధితులకు పూర్తి స్థాయి న్యాయం చేయాలని, వారి డబ్బులు త్వరితగతిన ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. కాగా, తుని ఘటనపైనా అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. లోతైన విచారణ నిర్వహించి కేసు దర్యాప్తు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.