: కేసీఆర్ ఇంట్లో లంచ్ చేసిన అరుణ్ జైట్లీ
తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు మధ్యాహ్నం భోజనం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం మామిడిపల్లిలో సింబయాసిస్ అంతర్జాతీయ యూనివర్శిటీ ప్రారంభోత్సవం నిమిత్తం అరుణ్ జైట్లీ ఇక్కడికి వచ్చారు. వర్శిటీ ప్రారంభోత్సవం అనంతరం కేసీఆర్ అధికారిక నివాసంలో ఆయన లంచ్ చేశారు.