: లగేజీతో పాటు మనల్ని కూడా మోసుకెళ్లే 'సూట్ కేసు కమ్ బైక్'
తొలి సూట్ కేసు కమ్ బైక్ ను చికాగోకు చెందిన వ్యాపారవేత్త కెవిన్ ఓ డెనెల్ ఒక ఇంజనీరు సాయంతో రూపొందించారు. లగేజీతో పాటు మనల్ని కూడా మోసుకెళ్లేందుకు వీలుగా ఈ సూట్ కేసు కమ్ బైక్ ను రూపొందించారు. లిథియం బ్యాటరీతో పనిచేేసే ఈ సూట్ కేసు బైక్ గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. ఈ సందర్భంగా కెవిన్ మాట్లాడుతూ, ఎయిర్ పోర్ట్, రైల్వేస్టేషన్లలో లగేజీతో పాటు ప్రయాణించేందుకు వీలుగా ఈ మోడో బ్యాగ్ ను తయారు చేశామన్నారు. సూట్ కేసుపై కూర్చొని హ్యాండిల్ వంటి పరికరాన్ని పైకి లేపి మోడో బ్యాగ్ ను ఆపరేట్ చేయాలని, కాళ్లు పెట్టుకునేందుకు వీలుగా ఫూట్ ఫెడల్స్ ను కూడా అమర్చామని, అంతేకాకుండా, ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జింగ్ చేసేందుకు వీలుగా దీనిలో ప్రత్యేక పోర్టులున్నాయని కెవిన్ పేర్కొన్నారు.