: ‘కబాలి’ సీక్వెల్ కు ప్లాన్ చేస్తున్నా: నిర్మాత కలైపులి
ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ చిత్రం ‘కబాలి’ కలెక్షన్ల రికార్డు సృష్టిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ మొదలు నుంచి విడుదలయ్యే వరకు ప్రచార కార్యక్రమాలు కనీవినీ ఎరుగని రీతిలో, ఒక రేంజ్ లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘ఫోర్బ్స్’ పత్రికతో ‘కబాలి’ నిర్మాత కలైపులి ఎస్ థాను మాట్లాడుతూ, ఈ చిత్రం సీక్వెల్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నానని, సీక్వెల్ రావడం ఖాయమని వెల్లడించారు.