: 'తాజా వార్త... మరో ఆప్ ఎమ్మెల్యేను మోదీ అరెస్ట్ చేయించారు': కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ను ఈ ఉదయం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళను బెదిరించినట్టుగా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో అదుపులోకి తీసుకున్నట్టు అగ్నేయ ఢిల్లీ డీసీపీ వెల్లడించారు. ఇక దీనిపై అరవింద్ కేజ్రీవాల్ తనదైన శైలిలో స్పందించారు. "తాజా వార్త - మరో ఆప్ ఎమ్మెల్యేను మోదీ అరెస్ట్ చేయించారు" అని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. దళితులపై జరిగిన దాడులను ఖండిస్తూ, ఆయన్నుంచి ఒక్క మాట కూడా రాలేదని విమర్శించారు. గుజరాత్ తో ప్రజలు ఆనందీబెన్ పటేల్ పాలన పట్ల ఎంతో ఆగ్రహంతో ఉన్నారని, వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల ఫలితాలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయని జోస్యం చెప్పారు.
Just in - Modi ji arrests one more AAP MLA.
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 24, 2016