: ఒడిశా స్కూల్ లో టీచర్ల పైశాచికత్వం... ఏడుగురిపై కేసులు!


తమ వద్దకు వచ్చే విద్యార్థినీ విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి ప్రయోజకుల్ని చేయాల్సిన ఆ ఉపాధ్యాయులు కామాంధులయ్యారు. తరగతి గదులను, లైబ్రరీలతో పాటు పాఠశాల ఆవరణనూ తమ పైశాచికత్వానికి వేదికగా మార్చారు. ఏడు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు దిగి తమ వృత్తికే మాయని మచ్చ తెచ్చారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా దామన్ జోడీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగింది. టీచర్లు తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని బాలికల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో, అధికారులు విచారణ చేపట్టి ఏడుగురిని నిందితులుగా తేల్చారు. వీరందరిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

  • Loading...

More Telugu News