: 'కబాలి' స్ఫూర్తితో యువతిని రక్షించిన అభిమాని!


సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి' చిత్రం చూసి అప్పుడే వస్తున్నాడు ఓ అభిమాని. మార్గమధ్యంలో ఓ యువతిపై అత్యాచారం చేసేందుకు కామాంధులు ప్రయత్నిస్తూ కనిపించారు. అంతే... 'కబాలి'లోని రజనీకాంత్ అతనికి గుర్తొచ్చాడు. ఒక్క ఉదుటున ముందుకు ఉరికాడు. ఆ దుండగులను కుమ్మేశాడు! ఈ ఘటన చెన్నైలోని అలంద్ పూర్ సమీపంలో జరిగింది. చిత్రం చూసిన వసంతపాల్ అనే రజనీ వీరాభిమాని, ఇంటికి వెళుతున్న క్రమంలో, పెద్దగా జన సంచారం లేని చోట ఓ యువతి తనను కాపాడాలని పెద్దగా కేకలు పెడుతోంది. చూస్తే, ముగ్గురు యువకులు ఆమెను బలవంతం చేస్తున్నారు. వెంటనే స్పందించిన పాల్, పెద్దగా అరుస్తూ, ఆ ముగ్గురిపై కలియబడ్డాడు. పిడిగుద్దులు గుద్దాడు. దీంతో సదరు యువతి తప్పించుకుంది. ఆ ముగ్గురూ కూడా పారిపోయారు. వారి ముఖాలు తనకు గుర్తేనని, వారి కోసం వెతుకుతున్నానని వసంతపాల్ తెలిపాడు.

  • Loading...

More Telugu News