: రైల్వే టికెట్లన్నీ ఆన్ లైన్లోనే... దశలవారీగా టికెట్ కౌంటర్ల మూసివేతకు నిర్ణయం
మరో నాలుగేళ్లలో రైల్వే టికెట్ కౌంటర్లన్నింటినీ మూసివేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వేల్లో ఒకటిగా ఉన్న భారత రైల్వే శాఖలో, వేతనాల భారాన్ని సాధ్యమైనంతగా తగ్గించుకునేందుకు నిర్ణయించిన అధికారులు, తొలి దశలో టికెట్ కౌంటర్ల సిబ్బందితో పాటు టీసీల సంఖ్యపై దృష్టిని సారించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో టికెట్ జారీ విధుల్లో ఉన్న 40 మందిని ఇప్పటికే సరెండర్ చేసింది. ఆన్ లైన్ మార్గంలో రిజర్వేషన్ చేయించుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో 2020 నాటికి దశలవారీగా అన్ని టికెట్ కౌంటర్లనూ మూసివేసేలా సంస్కరణలను చేపట్టింది. ఇదే సమయంలో ఒక్కో రైలును ముగ్గురి నుంచి నలుగురు టీసీలకు పరిమితం చేయాలని కూడా రైల్వే శాఖ నిర్ణయించింది. పదవీ విరమణ చేసిన వారి స్థానంలో కొత్త నియామకాలు ఆపివేయాలని తద్వారా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడంతో పాటు వేతనాల భారం నుంచి ఉపశమనం పొందవచ్చని రైల్వే శాఖ భావిస్తోంఃది.