: మీ పప్పులు ఇక్కడ ఉడకవు... పాక్ ప్రధానిపై సుష్మా స్వరాజ్ ఆగ్రహం


పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్ షరీఫ్ పై విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండెకు శస్త్రచికిత్స జరిగిన అనంతరం తొలిసారిగా నవాజ్ షరీఫ్ బహిరంగ సభలో మాట్లాడుతూ, ఏదో ఒకరోజు కాశ్మీర్ పాక్ లో భాగమవుతుందని, కాశ్మీర్ ను ఆశీర్వదిస్తానని చెప్పిన ఆయన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. పాకిస్థాన్ ప్రధాని జమ్ముకాశ్మీర్‌ ను ఆశీర్వదించడం సంగతి దేవుడెరుగు కానీ, అంతకు ముందే కాశ్మీర్ ను పాక్ ఉగ్రవాదులతో నింపేస్తోందని విమర్శించారు. జమ్మూకాశ్మీర్ లో హింసతో అలజడి సృష్టించాలని పాక్ పన్నాగాలు పన్నుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్ లో అశాంతికి పాకిస్థాన్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వారి పప్పులుడకవని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News