: ప్రధాని పర్యటనను పార్టీకి ఉపయోగపడేలా మలుచుకుంటాం: బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్
ప్రధాని మోదీ వచ్చేనెల 7వ తేదీన హైదరాబాద్‌లో పర్యటిస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మోదీ తన పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లో తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తల భేటీకి కూడా మోదీ హాజరవుతారని ఆయన తెలిపారు. బంగారు తెలంగాణను సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలుండాలని పేర్కొన్నారు. మోదీ హైదరాబాద్ పర్యటనను తమ పార్టీకి ఉపయోగపడేలా మలుచుకుంటామని ఆయన తెలిపారు. సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను గురించి వివరించి చెబుతూ వారికి దగ్గర చేస్తామని పేర్కొన్నారు. మోదీ హైదరాబాద్ పర్యటనతో హైకోర్టు విభజన, ఎస్సీ వర్గీకరణ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు.