: శ్రీనగర్ లో దేశ వ్యతిరేకులకు సవాల్ విసిరిన బాలిక


కాశ్మీరీల్లో కొందరు కావాలనే జాతీయ జెండాను అవమానిస్తున్నారని ఆరోపించిన లూధియానాకు చెందిన 15 ఏళ్ల ఝాన్వి బెహల్... ఆగస్టు 15న శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఎగురవేస్తానని, దమ్ముంటే వచ్చి ఆపాలని సవాల్ విసిరింది. శీనగర్ లోని లాల్ చౌక్ లో నిరంతరం భారత జాతీయ జెండాకు అవమానం జరుగుతోందని, కొందరు కావాలనే పాకిస్థాన్ జెండాలు ఎగురవేస్తూ దేశాన్ని అవమానిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే తాను లాల్ చౌక్ లో జాతీయ జెండా ఎగురవేయాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. కాగా, ఝాన్వి గతంలో మోదీని కన్నయ్య కుమార్ బహిరంగ చర్చకు రమ్మని సవాల్ విసిరినప్పుడు.... తనను ఓడించి మోదీతో చర్చలో కూర్చోవాలని ఝాన్వి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News