: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న ఇంటెలిజెన్స్
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఈరోజు ఇద్దరు అనుమానితులను ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారణ నిమిత్తం శంషాబాద్ విమానాశ్రయం పోలీసులకు అప్పగించారు. వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి వారిని పలు విషయాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. అనుమానితులిద్దరూ హైదరాబాద్ లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన వారుగా తెలుస్తోంది. ఈ అంశం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.