: హైదరాబాద్‌లో భారతీయ మజ్దూర్ సంఘ్ భారీ ప్రదర్శన
హైదరాబాద్‌లో భారతీయ మజ్దూర్ సంఘ్ ఈరోజు భారీ ప్రదర్శన నిర్వహించింది. నగరంలోని సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తోన్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన తెలిపారు. ర్యాలీ అనంతరం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ బహిరంగ సభలో వారు పాల్గొన్నారు. కార్మికులకు సానుకూలంగానే ప్రభుత్వ విధానాలు ఉండాలని, వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తే సహించబోమని వారు అన్నారు.