: బంపర్ ఆఫర్... మాల్యాకు చెందిన 8 కార్లు 14 లక్షల ప్రారంభ ధరతో వేలం!


మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన 8 కార్ల విలువ కేవలం 14 లక్షల రూపాయలా? అని ఆశ్చర్యపోతున్నారా? అవును నిజమే! బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా నుంచి బకాయిలు వసూలు చేసుకోలేక సతమతమవుతున్న బ్యాంకులు ఆయన ఆస్తులను అమ్మేసి అయినా సరే నష్టాన్ని భర్తీ చేసుకోవాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ మాల్యాకు చెందిన 8 కార్లను, 13.70 లక్షల రూపాయల టార్గెట్ ధరతో కేవలం 14 లక్షల రూపాయల ప్రారంభ ధరతో ఆదాయం పన్ను, సేవా పన్ను శాఖ సహకారంతో ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ ఆగస్టు 25 న వేలం నిర్వహించనుంది. ప్రస్తుతానికి కింగ్ ఫిషర్ హౌస్ బ్యాక్ యార్డులో పార్కు చేసివున్న ఈ కార్ల వేలంలో పాల్గొనాలంటే... ప్రతి వాహనానికి కోట్ చేసిన ధరలో 10 శాతం మొత్తాన్ని అంటే 2,000 రూపాయలను ఆగస్టు 23లోపు డిపాజిట్ చేయాల్సి ఉంది. ఈ కార్ల కండిషన్ పై అనుమానాలు ఉండి తనిఖీ చేయాలనుకుంటే జూలై 29 నుంచి ఆగస్టు 5 వరకు తనిఖీ చేసుకునే అవకాశాన్ని కూడా బ్యాంకు అదికారులు కల్పించారు.

  • Loading...

More Telugu News