: కృష్ణా నదిలో డెవిల్ ఫిష్!... పుష్కరాల సమయంలో ఇదేమిటబ్బా?


కృష్ణమ్మకు పుష్కరాలు సమీపిస్తున్నాయి. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో ప్రస్తుతం పుష్కర పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పిడుగు లాంటి ఓ వార్త అటు పుష్కర పనుల్లోని అధికార యంత్రాంగంతో పాటు ఇటు పుష్కరాలకు తరలివచ్చేందుకు సిద్ధపడుతున్న భక్తులను హడలెత్తిస్తోంది. కృష్ణా నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన జాలర్లు మోసుకొచ్చిన ఈ వార్తపై ప్రస్తుతం ఆందోళన నెలకొంది. అసలు విషయమేంటంటే... కృష్ణా నదీ జలాల్లో ప్రస్తుతం డెవిల్ ఫిష్ ఎంటరైంది. శరీరం నిండా ముళ్లతో చేపలనే ఆహారంగా తీసుకుంటున్న సదరు డెవిల్ ఫిష్ ల సంఖ్య ప్రస్తుతం వేల సంఖ్యలో నదిలో దర్శనమిస్తున్నాయట. పవిత్ర పుష్కరాల సమయంలో ఈ డెవిల్ ఫిష్ ఎంట్రీతో నది పవిత్రత దెబ్బ తింటుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా నిన్నటిదాకా కృష్ణా నదిలో కనిపించని ఈ డెవిల్ ఫిష్... ఇప్పుడెలా ప్రత్యక్షమైందన్న విషయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవలే పట్టిసీమ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు కృష్ణా నదిలో కలిశాయి. ఈ నీటి ద్వారానే డెవిల్ ఫిష్ కృష్ణా నదీ జలాల్లోకి ఎంటరై ఉంటాయన్న వాదన వినిపిస్తోంది. పుష్కరాల సంగతి అలా ఉంచితే... ఇప్పటికే కృష్ణా జలాల్లో పెను బీభత్సం సృష్టిస్తున్న డెవిల్ ఫిష్ మత్స్యకారుల వలలను చీల్చి పారేయడమే కాకుండా జాలర్లను గాయాలపాల్జేస్తున్నాయట. దీంతో నదిలోకి చేపల వేటకు వెళ్లాంటేనే మత్స్యకారులు బెంబేలెత్తిపోతున్నారు.

  • Loading...

More Telugu News