: ప్రధాని మోదీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఇద్దరు వ్యక్తుల అరెస్టు
ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఇద్దరు వ్యక్తులను జార్ఖండ్ లో సీబీఐ అధికారులు ఈరోజు అరెస్టు చేశారు. మే 2015లో పశ్చిమబెంగాల్ కు చెందిన పండిట్ స్వరాజ్ కుమార్ రాయ్, సువెందు కుమార్ బర్మన్ తో కలిసి ప్రధాని మోదీ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఆగస్టు 15 వేడుకల్లో సంగీత కచేరి నిర్వహించాలని మోదీ తనకు లేఖ రాశారంటూ సంబంధిత అధికారులకు చూపిన లేఖలో మోదీ సంతకం ఉంది. దీనిపై నిర్వాహకులు ఆరా తీయగా.. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో అసలు విషయం బయటపడింది. అది ఫోర్జరీ సంతకం అని తేలింది. దీంతో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. బెంగాల్ లో ఫోర్జరీకి పాల్పడిన మరికొన్ని పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను సీబీఐ కోర్టులో హాజరుపరచగా ఈ నెల 27వరకు కస్టడీకి అనుమతించారు.