: సొంత ఇళ్లలో మరుగుదొడ్లు కట్టించుకున్న వారికి ‘కబాలి’ టికెట్లిచ్చారు
సొంత మరుగుదొడ్లు కట్టించుకున్న వారికి ‘కబాలి’ టికెట్లు ఇచ్చి మరీ, వారిని సినిమాకు పంపించారు. ఈ సంఘటన కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో జరిగింది. సొంత ఇళ్లలో మరుగుదొడ్లు కట్టించుకున్న వారికి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ‘కబాలి’ టికెట్లను అందజేశారు. కాగా, పాండిచ్చేరి అభివృద్ధి నిమిత్తం కిరణ్ బేడీ ఈవిధంగా చేశారు. ఎందుకంటే, తమిళనాడు, పాండిచ్చేరిలో రజనీకాంత్ మేనియాను దృష్టిలో పెట్టుకున్న కిరణ్ బేడీ, రజనీ క్రేజ్ ను ఈవిధంగా తమ ప్రాంతం అభివృద్దికి ఉపయోగించుకున్నారు.