: వినూత్నంగా మొక్కలు పంపిణీ చేసిన వార్డు కౌన్సిలర్


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా పరకాల నగర పంచాయతీ 6వ వార్డు కౌన్సిలర్ జయమ్మ మొక్కలు పంపిణీ చేశారు. అయితే, ఈ పంపిణీ చాలా వినూత్నంగా జరిగింది. పంపిణీ చేయాల్సిన మొక్కలన్నింటినీ ఒక రిక్షాలో వేసుకుని ఇంటింటికీ తిరిగారు. రిక్షా తొక్కుతూ మొక్కలు పంపిణీ చేసిన ఆమెను ఈ సందర్భంగా స్థానికులు అభినందించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తానీ పనికి పూనుకున్నానని చెప్పిన జయమ్మ, తనకు చిన్నప్పటి నుంచి రిక్షా తొక్కడం అలవాటేనని చెప్పారు.

  • Loading...

More Telugu News