: జాతీయగీతాలాపనలో తప్పులు...సన్నీ లియోన్ పై కేసు
ప్రోకబడ్డీ లీగ్ కు ప్రాచుర్యం కల్పించేందుకు టోర్నీ నిర్వాహకులు జాతీయగీతం ఆలపించేందుకు బాలీవుడ్ శృంగారభామ సన్నీ లియోన్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె జాతీయ గీతాన్ని తప్పుగా ఆలపించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. పదాలు పలకడం దగ్గర్నుంచి, రాగం ఆలపించడం వరకు ఆమె పొరపాట్లు చేశారని, తద్వారా జాతీయ గీతాన్ని అవమానించారని పేర్కొంటూ ఢిల్లీ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మ్యాచ్ సందర్భంగా ప్రోకబడ్డీ మ్యాచ్ ప్రారంభానికి రావడాన్ని, జాతీయగీతం ఆలపించడాన్ని గర్వంగా భావిస్తున్నానని సన్నీ లియోన్ తెలిపింది. జాతీయగీతం ఆలపించే సమయంలో కంగారు పడిన మాట వాస్తవమేనని తెలిపింది. అయితే జాతీయగీతం ఆలపించడం అదృష్టమని పేర్కొన్న సన్నీ, జాతీయగీతాలాపనతో తన జీవితం ధన్యమైందని పేర్కొంది. జాతీయగీతాలాపనకు చాలా ప్రాక్టీస్ చేశానని తెలిపింది.