: మాయావతిపై దయాశంకర్ సింగ్ భార్య ఫిర్యాదు.. ఎఫ్‌ఐఆర్ నమోదు
బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ఉత్తరప్రదేశ్ బీజేపీ మాజీ నేత దయాశంకర్ సింగ్ ఇటీవల అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద రాజకీయ దుమారమే చెలరేగింది. ఈ నేపథ్యంలో, బీఎస్పీ నుంచి తమకు వేధింపులు ఎదురవుతున్నాయని దయాశంకర్ భార్య స్వాతి సింగ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 120/బి, 153ఏ, 506, 509 సెక్షన్ల కింద మాయావతితో పాటు మరో ముగ్గురు బీఎస్పీ నేతలపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. మాయావతితో పాటు బీఎస్పీ నేతలు తమ కుటుంబంపై బెదిరింపులకు దిగుతున్నారని, వారి నుంచి తమ కుటుంబానికి ప్రమాదం ఉందని స్వాతీ సింగ్ ఆరోపించారు.