: అంతం కాదిది...ఆరంభం...తెలుగు ఆత్మగౌరవ సత్తా చూపిస్తాం: రేణుకా చౌదరి


ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా బిల్లును కుయుక్తితో బీజేపీ అడ్డుకుందని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ఆరోపించారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా బిల్లును అడ్డుకున్న బీజేపీ అందులో విజయం సాధించామని సంబరపడుతోందని అన్నారు. సభను సోమవారానికి వాయిదా వేసిన బీజేపీ బిల్లును ఎల్లకాలం అడ్డుకోలేదని ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా బిల్లుపై పోరాటానికి ఇది అంతం కాదని, ఇది ఆరంభం మాత్రమేనని ఆమె అన్నారు. ఆంధ్ర అంటే ఏంటో...తెలుగు వాడి ఆత్మగౌరవం సత్తా ఏంటో బీజేపీకి రుచి చూపిస్తామని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News