: రాష్ట్ర విభజనకు మించిన అఘాయిత్యం ఈరోజు జరిగింది: ఉండవల్లి
కేవీపీ రాజ్యసభలో పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లు ఓటింగ్‌కి రాకపోవడంతో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టాన్ని, నాటి ప్రధాని ఇచ్చిన హామీలను ఎన్డీఏ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ఈరోజు బిల్లు ఓటింగ్‌కి రాకపోవడం బీజేపీ చేస్తోన్న రాజకీయంలో భాగమేనని ఆయన అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంపై దేశంలోని అన్ని పార్టీలు ఒత్తిడి తీసుకురావాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు మించిన అఘాయిత్యం ఈరోజు రాజ్యసభలో జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.