: ఏపీకి ప్రత్యేకహోదా బిల్లుపై చర్చించండి...ప్రజాస్వామ్యాన్ని రక్షించండి: సీతారాం ఏచూరి


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లుపై ఓటింగ్ జరపాలని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. రాజ్యసభలో గందరగోళం నెలకొన్న వేళ సభను ఆర్డర్ లో పెట్టాల్సిందిగా సీతారాం ఏచూరి వంటి సీనియర్ నేతలకు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సూచించారు. దీనికి స్పందించిన సీతారాం ఏచూరి... కేవలం రాజకీయ కారణాల వల్ల బీజేపీ ఈ బిల్లును చర్చకు రానీయకుండా అడ్డుకుంటోందని విమర్శించారు. ఇలాంటి సంప్రదాయానికి సభ సహకరించకూడదని సూచించిన ఆయన, తక్షణం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లుపై ఓటింగ్ కు అనుమతించాలని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిప్యూటీ ఛైర్మన్ కు సూచించారు. దీంతో మరోసారి సభ్యులను శాంతించాలని ఆయన సూచించినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో సభను వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News