: అధికార, విపక్ష సభ్యుల నినాదాల నేపథ్యంలో... రాజ్యసభ సోమవారానికి వాయిదా
బీజేపీ వ్యూహం ఫలించింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై ఈ రోజు ఓటింగ్ జరగకుండానే రాజ్యసభ వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై చర్చ, ఓటింగ్ చేపట్టాలంటూ విపక్ష నేతలు డిమాండ్ చేయగా, అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో అధికార, విపక్షాలకు చెందిన నేతలు పోడియంలోకి దూసుకువచ్చి నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. డిప్యూటీ ఛైర్మన్ కురియన్ పలుమార్లు సభను ఆర్డర్ లో పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఈ నెల 25వ తేదీకి సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది.