: తీవ్ర ఉద్వేగానికిలోనై కంటతడి పెట్టిన సీఎం మెహబూబా ముఫ్తీ


హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తర్వాత క‌శ్మీర్‌లో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. రెచ్చిపోతోన్న ఆందోళ‌న‌కారుల‌పై పోలీసులు కాల్పులు జ‌ర‌ప‌వ‌ల‌సి వ‌చ్చింది. అల్ల‌ర్ల‌లో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 2వేల మంది గాయాల‌తో చికిత్స పొందుతున్నారు. దీని ప‌ట్ల పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర ఉద్వేగానికి లోనై కంట‌త‌డి పెట్టారు. అనంత్‌నాగ్ జిల్లాలో ఆమె ప‌ర్య‌టించిన ఆమె అక్క‌డి ప‌రిస్థితుల‌ను, అల్ల‌ర్ల కార‌ణంగా అమాయ‌క ప్ర‌జ‌లు ఎదుర్కుంటోన్న స‌మ‌స్య‌ల‌ను చూశారు. అనంత‌రం ఆమె అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ భావోద్వేగానికి లోని కన్నీరు పెట్టారు. కశ్మీర్‌లో ప్ర‌శాంత వాతావ‌రణం నెల‌కొల్పేందుకు అంద‌రూ కృషి చేయాల‌ని ఆమె అన్నారు. అనంత్‌నాగ్‌లో అల్ల‌ర్ల‌ను అదుపుచేసేందుకు భద్రతాసిబ్బంది జరిపిన కాల్పుల్లో అక్క‌డి చిన్నారులు సహా చాలా మంది కంటి చూపు కోల్పోయారని ఆమె బాధప‌డ్డారు.

  • Loading...

More Telugu News