: భగవంత్ మాన్ చర్య చాలా తీవ్రమైంది.. ఆయ‌న‌పై చ‌ర్య తీసుకుంటా: లోక్‌స‌భ స్పీక‌ర్‌


ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవత్ మాన్ తాను ఇంటి వద్ద బయలుదేరినప్పటి నుంచి లోక్‌స‌భ లోపలికి వెళ్లే వ‌ర‌కు తీసిన‌ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన అంశంపై లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భగవంత్ మాన్ చర్య చాలా తీవ్రమైనద‌ని ఆమె పేర్కొన్నారు. ఆయ‌న‌పై చ‌ర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు. భగవంత్ మాన్ చర్యపై కాంగ్రెస్ పార్టీ నేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ ఈ చర్య‌ను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని అన్నారు. దేశ భ‌ద్ర‌త‌కు విఘాతం క‌లిగించేలా ఈ అంశం ఉంద‌ని, ఇలా ఎవ‌రు ప్ర‌వ‌ర్తించినా చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇలాంటి చ‌ర్య‌లు ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కు మంచిదికాద‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News