: ఆకాశంలో ఉండగానే ఎయిర్ కొరియా విమానంలో మంటలు!... షియాంగ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
ఆకాశయానంలో మరో ఘోర ప్రమాదం తప్పింది. ఆకాశంలో ఉండగానే విమానంలో మంటలు చెలరేగితే... పరిస్థితి ఏంటనే విషయాన్ని తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి ఘటనే ఎయిర్ కొరియా విమానంలో చోటుచేసుకుంది. అయితే అప్రమత్తంగా వ్యవహరించిన పైలట్ విమానాన్ని చైనాలోని షియాంగ్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో పెను ముప్పు తప్పింది. విమానం ల్యాండ్ కాగానే ఎయిర్ పోర్టు సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని విమానంలోని ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించేశారు. నేటి ఉదయం చైనాలోని గగనతలంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఏ ఒక్కరికి కూడా గాయాలు కాకపోవడం గమనార్హం.