: కేవీపీ బిల్లుకు మద్దతుగా ఓటేస్తా!: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటన
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లుకు మరింత మద్దతు లభించింది. ఇప్పటికే ఏపీలోని అధికార పార్టీ టీడీపీ, వామపక్షాలు ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాయి. తాజాగా ప్రత్యేక హోదా కోసం ఆది నుంచి పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటున్న ఏపీలోని విపక్షం వైసీపీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు రాజ్యసభలో ఆ పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎంపీ విజయసాయిరెడ్డి కొద్దిసేపటి క్రితం కీలక ప్రకటన చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేవీపీ ప్రతిపాదించిన బిల్లుకు వైసీపీ ఎంపీగా తాను అనుకూలంగా ఓటేస్తానని ఆయన ఢిల్లీలో ప్రకటించారు.