: జగన్ పార్టీపై ఆదిరెడ్డి సంచలన కామెంట్స్!... కష్టపడే వాళ్లకు వైసీపీలో విలువ లేదని వ్యాఖ్య!


ఏపీలో విపక్ష పార్టీ వైసీపీ నుంచి తొలి ఎమ్మెల్సీగా పదవి దక్కించుకున్న ఆదిరెడ్డి అప్పారావు నిన్న ఆ పార్టీ వైఖరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ పటిష్టత కోసం కష్టపడేవారికి వైసీపీలో విలువ లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ పటిష్టతకు కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో విలువే లేదని ఆయన పేర్కొన్నారు. విలువ ఇవ్వని పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా ఏం లాభమని కూడా ఆయన తనకు దక్కిన ప్రాధాన్యంపై పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైకి సూటి ప్రశ్నలు సంధించారు. ‘‘విలువ ఇవ్వనప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇస్తే మాత్రం ఏం లాభం?’’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీలో పెద్ద చర్చకే తెర తీయనున్నాయి. వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్న నేపథ్యంలో నిన్న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News