: శాన్ ఫ్రాన్సిస్కో ధియేటర్ లో రజనీకాంత్ కు స్టాండింగ్ ఒవేషన్
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 'కబాలి' ప్రివ్యూ ప్రదర్శిస్తున్న థియేటర్లో సూపర్ స్టార్ రజనీ కాంత్ దర్శనమివ్వడంతో సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అనుకోని అతిథి ధియేటర్ లో ప్రత్యక్షమవ్వడంతో ప్రేక్షకులు ఆయనకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. సినిమా ప్రదర్శన సమయంలో పలు మార్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సినిమాలో రజనీ కాంత్ అభిమానులను అలరించే సీన్లు ఎన్నో ఉన్నాయని, ఈ సినిమా అభిమానులకు విందు భోజనం లాంటిదేనని వారు పేర్కొంటున్నారు.