: రాజ్యసభలో ప్రతిపక్ష నేతలతో ముచ్చటించిన ప్రధాని మోదీ
ఈరోజు రాజ్యసభలో ప్రతిపక్ష నేతలను ప్రధాని నరేంద్రమోదీ పలకరించారు. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం సభ్యులు లంచ్ కు వెళ్తున్న సందర్భంలో మోదీ తన సీట్ లో నుంచి లేచి వెళ్లి ప్రతిపక్ష సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ ఆనంద్ శర్మ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. శరద్ పవార్ తో కొంచెంసేపు మోదీ మాట్లాడారు. డీఎంకే ఎంపీ కనిమొళి, మరో నామినేటెడ్ ఎంపీ అను అగా తదితరులు మోదీ దగ్గరికి వెళ్లగా పరస్పరం సంభాషించుకున్నారు. అనంతరం సభ నుంచి మోదీ బయటకు వెళ్లిపోయారు.