: సెట్ టాప్ బాక్స్ పెట్టుకోలేదా.. మీ టీవీ మోగదిక


రాష్ట్రంలోని హైదరాబాద్, విశాఖ నగర వాసులకు సెట్ టాప్ బాక్సులు ఏర్పాటుకు హైకోర్టు ఇచ్చిన గడువు రేపటితో ముగిసిపోతోంది. అంటే మంగళవారం నుంచీ సెట్ టాప్ బాక్సులుంటేనే టీవీ కార్యక్రమాలు చూడగలరు. వాస్తవానికి ఈ గడవు గత నెల 31తోనే ముగిసిపోగా హైకోర్టు ఈ నెల 29 వరకూ గడువు పొడిగించింది. మరో మూడు నెలలపాటు గడువు పొడిగించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనలు వెళ్లాయి. అయినా గడువు పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. కేబుల్ ప్రసారాల డిజిటలైజేషన్ మూడవ దశ కింద దేశంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో కేబుల్ ప్రసారాలను 2014 సెప్టెంబర్ 30లోపు డిజిటల్ ప్రక్రియలోకి మార్చాల్సి ఉంటుంది. అంటే కస్టమర్లందరూ సెట్ టాప్ బాక్సులు కొనుగోలు చేయాలి. 2014 డిసెంబర్ 31 లోపు ఇది దేశంలోని మిగతా అన్ని ప్రాంతాలకూ వర్తిస్తుంది.

  • Loading...

More Telugu News