: క్షమాపణలు కోరడం గాంధీల చరిత్రలోనే లేదు: దిగ్విజయ్ సింగ్
గాంధీల కుటుంబం చరిత్రలో క్షమాపణలు చెప్పడమన్న మాటేలేదని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, గాంధీల కుటుంబం ఇతవరకు క్షమాపణలు చెప్పలేదని, ఇప్పుడు కూడా చెప్పదని అన్నారు. అవసరమైతే విచారణ ఏదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు. మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సే ఆర్ఎస్ఎస్ సభ్యుడని, తద్వారా గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కుట్రపన్నిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆర్ఎస్ఎస్ నేతలు కోర్టులో పరువునష్టం కేసు వేయగా, ఒక వ్యక్తి చేసిన హత్యను సంస్థకు అంటగట్టడం సరికాదని, ఈ ఘటనపై క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో విచారం వ్యక్తం చేయాలని, అది కూడా కుదరదంటే విచారణ ఎదుర్కోవాలని రాహుల్ కు సుప్రీంకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణకు సిద్ధమని రాహుల్ ప్రకటించగా, ఈ కేసులో తదుపరి విచారణ జూలై 27న జరగనుంది.