: నిర్వాసితులకు న్యాయం చేయాలి.. లేదంటే డ్యాంను పగులకొట్టడానికి వెనకాడబోం: తమ్మినేని
నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వాల్సిందేనంటూ సీపీఎం నిన్న ప్రారంభించిన పాదయాత్ర నల్గొండలో కొనసాగుతోంది. ప్రాజెక్టు ద్వారా భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగే వరకు దానిలో నీటి నిల్వకు అనుమతించబోమని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భూనిర్వాసితులకు సరైన పరిహారం అందించకుండా ప్రభుత్వం ఇదే తీరును కనబరిస్తే అవసరమైతే ఆ డ్యాంను పగులకొట్టడానికి కూడా వెనకాడబోమని ఆయన అన్నారు. నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం అందాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.