: తిరుమల రెండో ఘాట్ వద్ద ప్రమాదం... ముగ్గురి పరిస్థితి విషమం


తిరుమల రెండో ఘాట్ రోడ్డులోని పదో మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో పది మంది గాయపడ్డారు. మలుపు వద్ద అదుపుతప్పిన బొలేరో వాహనం చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ పది మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాధితులు నెల్లూరు వాసులుగా సంబంధిత అధికారులు గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News