: గుజరాత్‌లో దాడికి గురైన దళితులను పరామర్శించిన రాహుల్‌... రేపు కేజ్రీవాల్ పర్యటన


వారం రోజుల క్రితం గుజ‌రాత్‌లో జ‌రిగిన ద‌ళితుల‌పై దాడి అంశంపైనే ప్ర‌స్తుతం దేశ‌ రాజ‌కీయాల‌న్నీ తిరుగుతున్నాయి. పార్లమెంట్‌లో ఈ అంశంపైనే నిన్న ప్ర‌తిప‌క్షాలు కేంద్రంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించాయి. నిన్న గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి ఆనందిబెన్‌ పటేల్ ద‌ళితుల‌పై దాడి జ‌రిగిన గుజ‌రాత్‌లోని ఉనాలో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన ఆమె నిందితుల‌ను శిక్షిస్తామ‌ని అన్నారు. రేపు ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ ఆ ఉనాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈరోజు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఉనాలో బాధితుల‌ను క‌లిసి, ప‌రామ‌ర్శించారు. వారితో కాసేపు మాట్లాడి కేంద్రం తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ద‌ళితుల‌పై దాడి ఘ‌ట‌న‌లో గుజ‌రాత్ పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.

  • Loading...

More Telugu News