: సీఎం చంద్రబాబు పాలన ఇతివృత్తంగా ‘చంద్రోదయం’ సినిమా
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఇతివృత్తంగా ‘చంద్రోదయం’ సినిమాను తెరకెక్కించనున్నారు. వచ్చే నెల 4వ తేదీన ఈ చిత్రం షూటింగ్ ఒంగోలులో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు నిర్మాతగా విజయవాడ కార్పొరేటర్ కాకుమాను మల్లికార్జున యాదవ్, చిత్రానికి కథను అందిస్తున్న పసుపులేటి వెంకటరమణ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ను ఏపీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించనున్నట్లు సమాచారం.