: యూపీ భారీ ఉగ్రదాడి భగ్నం!... హిందూ ఆలయంలో 30 బాంబులు స్వాధీనం!
దేశంలో ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. మొన్న హైదరాబాదు కేంద్రంగా భారీ ఉగ్రదాడికి పథక రచన చేసిన ఐఎస్ ఉగ్రవాదులను చివరి నిమిషంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో పెను ఉగ్రదాడికి చెక్ పడిపోయింది. తాజాగా ఉత్తరప్రదేశ్ లో మరో భారీ ఉగ్రదాడికి పోలీసులు చెక్ పెట్టారు. పథక రచన పూర్తై, కార్యరంగంలోకి దిగేసిన ముష్కరులు... ఆ రాష్ట్రంలోని ప్రతాప్ గఢ్ జిల్లాలోని ఓ హిందూ ఆలయంలో 30 బాంబులు పెట్టారు. ఈ బాంబులను ఏ క్షణాన్నైనా పేల్చేసేందుకు ఉగ్రవాదులు కాచుకుని కూర్చున్నారు. అయితే ఆ బాంబులు పేలేలోగానే పోలీసులకు ఈ విషయం తెలిసిపోయింది. మెరుపు వేగంతో కదిలిన యూపీ పోలీసులు ఆలయంలో పెట్టిన బాంబులను నిర్వీర్యం చేయడంతో పాటు ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పెద్ద సంఖ్యలో పిస్లళ్లు, కాట్రిడ్జ్ లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనలో పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేసినా భారీ నష్టం జరిగేదేన్న వాదన వినిపిస్తోంది.